స్పెషాలిటీ హాస్పిటల్స్ వినతిని పరిగణనలోకి తీసుకోండి
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:41 AM
వివిధ చికిత్సలకు ధరలు నిర్ణయించే అంశంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఏఎస్‌హెచ్‌ఏ)వినతిని పరిగణనలోకి తీసుకొని...
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): వివిధ చికిత్సలకు ధరలు నిర్ణయించే అంశంలో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఏఎస్‌హెచ్‌ఏ)వినతిని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు. తమతో పాటు నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అందించే వివిధ చికిత్సలకు ధరలు నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏఎ్‌సహెచ్‌ఏ అధ్యక్షుడు కె.విజయ్ కుమార్ గత డిసెంబరులో పిటిషన్ దాఖలు చేశారు.