Share News

సేవాధారిత వృత్తిలో లాభార్జన చూడకూడదు

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:23 AM

వైద్య వృత్తి సేవాధారితమైనదని, ఈ వృత్తిలో లాభాలు కాకుండా రోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయడమే వైద్యుల అసలైన విజయమని వైద్య..

సేవాధారిత వృత్తిలో లాభార్జన చూడకూడదు

  • వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌ కుమార్‌

  • డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో ఘనంగా డాక్టర్స్‌ డే

విజయవాడ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): వైద్య వృత్తి సేవాధారితమైనదని, ఈ వృత్తిలో లాభాలు కాకుండా రోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయడమే వైద్యుల అసలైన విజయమని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌ కుమార్‌ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో బుధవారం ఉత్తమ వైద్యులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన పదిమంది ప్రముఖ వైద్యులను సత్కరించారు. ఈ సందర్భంగా సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ బీసీ రాయ్‌ సేవలను స్మరించుకోవాలని సూచించారు. సంజీవని వంటి కార్యక్రమాలు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయని, ఆయుష్మాన్‌ భారత్‌, డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడించారు.

Updated Date - Jul 02 , 2026 | 03:23 AM