Share News

మరో 5 రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:13 AM

రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ బుధవారం తెలిపారు.

మరో 5 రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు

అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ బుధవారం తెలిపారు. యాసిడ్‌ దాడి బాధితులు, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ డిజార్డర్‌, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ (ఏఎ్‌సడీ), బహుళ వైకల్యంలను జాబితాలో చేర్చినట్టు పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్లను పూర్తిగా డిజిటల్‌ విధానంలోనే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 25 నుంచి స్లాట్ల బుకింగ్‌ మొదలవుతుందని, 30 నుంచి ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇప్పటి వరకూ 40 శాతం ప్రామాణికంగా వైకల్య సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారని, ఇకపై ఎంత శాతం ఉన్నా సర్టిఫికెట్లు ఇస్తామన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 06:13 AM