సిజేరియన్లపై ఆడిట్ చేస్తాం: ఆరోగ్య శాఖ
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:32 AM
రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ ప్రసవాలను ఆరోగ్యశాఖ ఆడిట్ పరిధిలోకి తీసుకొస్తోంది.
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ ప్రసవాలను ఆరోగ్యశాఖ ఆడిట్ పరిధిలోకి తీసుకొస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం వైద్య సేవ ట్రస్ట్ సీఈవో చక్రధర్‌బాబు ఆస్పత్రులకు సర్క్యులర్ జారీ చేశారు. వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలని ఆస్పత్రులకు స్పష్టం చేశారు. ప్రతి కేసులో సిజేరియన్ చేయాల్సిన అవసరాన్ని సమర్థించే వైద్య కారణాలు, పరీక్షల నివేదికలు, ఇతర ఆధారాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.