Share News

సుస్థిరాభివృద్ధి సామర్థ్యం రాష్ట్రం సొంతం

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:12 AM

సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన అభివృద్ధి సాధించే బలమైన సామర్థ్యం రాష్ట్రానికి ఉందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు.

సుస్థిరాభివృద్ధి సామర్థ్యం రాష్ట్రం సొంతం

  • జేఎన్‌టీయూ(ఏ) 15వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

అనంతపురం ఉన్నతవిద్య, ఏప్రిల్‌6(ఆంధ్రజ్యోతి): సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన అభివృద్ధి సాధించే బలమైన సామర్థ్యం రాష్ట్రానికి ఉందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ-ఏ) 15వ స్నాత కోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తోపాటు శాస్త్రవేత్త, ఎన్‌ఐసీహెచ్‌ఈ యూనివర్సిటీ (కన్యాకుమారి) వీసీ టెస్సీ థామ్‌స పాల్గొన్నారు. గవర్నర్‌ మాట్లాడుతూ... ‘అత్యున్నత విద్య అంటే కేవలం సమాచారం అందించేది కాదని, జీవితాన్ని సమస్త సృష్టిలో సామరస్యంగా ఉండేలా తీర్చిదిద్దేదన్న’ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మాటలను గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం విస్తృత, సమ్మిళిత ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచి జాతీయ సగటు కంటే అధికంగా 36.5 శాతం స్థూల నమోదు నిష్పత్తి, 10.93 స్థూల సూచికతో స్థిరమైన పురోగతిని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన శాస్త్రవేత్త, ఎన్‌ఐసీహెచ్‌ఈ యూనివర్సిటీ(కన్యాకుమారి) వీసీ టెస్సీ థామ్‌సకు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. 31 మంది విద్యార్థులకు 45 బంగారు పతకాలు గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం చేశారు.

Updated Date - Apr 07 , 2026 | 04:13 AM