Share News

ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.3,061 కోట్లు

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:19 AM

ఈ ఏడాది ఫిబ్రవరిలో నికర జీఎస్టీ వసూళ్లు రూ.3,061 కోట్లకు చేరుకున్నట్లు రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్‌ కమిషనర్‌ బాబు.ఏ వెల్లడించారు.

 ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.3,061 కోట్లు

  • గత ఏడాది కంటే 5.45శాతం ఎక్కువ: చీఫ్‌ కమిషనర్‌

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఫిబ్రవరిలో నికర జీఎస్టీ వసూళ్లు రూ.3,061 కోట్లకు చేరుకున్నట్లు రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్‌ కమిషనర్‌ బాబు.ఏ వెల్లడించారు. గత ఏడాది ఫిబ్రవరిలో వసూలైన నికర జీఎస్టీ కంటే ఇది 5.45 శాతం అధికమని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 నెలల పాటు ఏపీలో నికర జీఎస్టీ వసూళ్లు 5.86శాతం పెరుగగా.. కర్ణాటకలో 5.7 శాతం, తమిళనాడు-3.1 శాతం, తెలంగాణ-4.57 శాతం, కేరళ-2.95 శాతం ఎక్కువగా వసూలయ్యాయి. ఒడిసాలో మాత్రం 8.18 శాతం తగ్గాయి. కాగా.. ఈ ఫిబ్రవరిలో ఏపీలో స్థూల జీఎస్టీ రూ.3,562 కోట్లు వసూలైంది.

Updated Date - Mar 02 , 2026 | 04:19 AM