Share News

గ్రూప్‌-1 కేసును సీబీఐకి అప్పగించాలి

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:41 AM

వైసీపీ హయాంలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీలో భారీగా అవకతవకలు జరిగాయని, ఉద్యోగాలను అమ్ముకున్నారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ ఆరోపించారు.

గ్రూప్‌-1 కేసును సీబీఐకి అప్పగించాలి

  • వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు అమ్ముకున్నారు: నిరుద్యోగ జేఏసీ

వైసీపీ హయాంలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీలో భారీగా అవకతవకలు జరిగాయని, ఉద్యోగాలను అమ్ముకున్నారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ ఆరోపించారు. ఈ అక్రమాలతో వందల కోట్ల రూపాయలు వైసీపీ నేతలకు అందిందన్నారు. సిట్‌ నివేదిక నేపథ్యంలో కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. 169 గ్రూప్‌-1 ఉద్యోగాలకు మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాలన్నారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ జగన్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మహంకాళి సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 14 , 2026 | 04:43 AM