Share News

మూడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల విస్తరణకు ఓకే

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:04 AM

రాష్ట్రంలోని తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుల రెండో దశ విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి వెల్లడించారు.

మూడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల విస్తరణకు ఓకే

  • రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో భూసేకరణకు పాలనామోదం

  • 6,248 ఎకరాల సేకరణకు 1638.52 కోట్లు మంజూరు

  • మంత్రులు, కార్యదర్శుల సమీక్షలో మంత్రి బీసీ జనార్దనరెడ్డి

అమరావతి. జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుల రెండో దశ విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, శాఖల వారీ కార్యదర్శులతో నెలవారీ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి జనార్దనరెడ్డి ప్రజెంటేషన్‌ సమర్పించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సీఎం ఆదేశాల మేరకు భూసేకరణకు పాలనానుమతులు ఇచ్చాం. 6,248 ఎకరాల భూసేకరణకు రూ.1,638.52 కోట్లు మంజూరయ్యాయి. రామాయపట్నం పోర్టు రెండో దశ కోసం 2,924.45 ఎకరాల భూసేకరణకు రూ.851 కోట్లు కేటాయించాం. మూలపేట పోర్టు విస్తరణ కోసం 1,903.29 ఎకరాల సేకరణకు రూ.440.52 కోట్లు మంజూరు చేస్తున్నాం. మూ లపేటలో ఉప్పుకయ్యల భూసేకరణతో సహా.. సహా య పునరావాస పనులు చేపడుతున్నాం. మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు రెండో దశ అభివృద్ధిలో భా గంగా 1,470.70 ఎకరాల భూసేకరణకు దాదాపు రూ.347 కోట్లను విడుదల చేస్తున్నాం. తిరుపతి జి ల్లా సత్యవేడు మండలం చిన్న ఈటేబాకం గ్రామం లో ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ పార్కు ఏర్పాటుకు 53.01 ఎకరాలు కేటాయించాం. మౌలిక సదుపాయాలకు నెక్సస్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ పార్కు చేసిన రూ. 255 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు మారిటైమ్‌ బోర్డు ఆమోదం తెలిపింది’ అని తెలిపారు.

Updated Date - Jul 15 , 2026 | 05:05 AM