16 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:14 AM
రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ బీ రమ్యకీర్తనను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గాను, వెయిటింగ్‌లో ఉన్న పీవీవీడీ ప్రసాదరావును గ్రేటర్ విశాఖ(సౌత్) జోనల్ కమిషనర్‌గాను, అక్కడ పనిచేస్తున్న మల్లయ్య నాయుడును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గానూ బదిలీ చేశారు.