Share News

ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు, రేషన్‌ కార్డులు: డోలా

ABN , Publish Date - May 15 , 2026 | 05:00 AM

ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్‌ రేషన్‌కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు.

ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు, రేషన్‌ కార్డులు: డోలా

అమరావతి మే 14 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్‌ రేషన్‌కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో ట్రాన్స్‌ జెండర్‌ వెల్ఫేర్‌ బోర్డు సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్స్‌ సమస్యల పరిష్కారం, సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై చర్చించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ, బహిరంగ ప్రదేశాలు, ఆసుపత్రుల్లో వారికి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - May 15 , 2026 | 05:00 AM