Share News

మహిళలకు ఆర్థిక స్వావలంబన

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:37 AM

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అనేక ఒప్పందాలు చేసుకుంది. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా.....

మహిళలకు ఆర్థిక స్వావలంబన

  • 36 సంస్థలతో సెర్ప్‌, మెప్మా ఒప్పందాలు

అమరావతి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అనేక ఒప్పందాలు చేసుకుంది. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో సెర్ప్‌, మెప్మా సంస్థలు 36 ఒప్పందాలు చేసుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 260 ఎగ్‌ కార్ట్స్‌ సహా మహిళలతో మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ ఏర్పాటు కోసం జాతీయ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీతో ఒప్పందం కుదిరింది. అలాగే డ్వాక్రా మహిళల రుణాలపై డేటా డ్రివెన్‌ క్రెడిట్‌ అసె్‌సమెంట్‌ మోడల్స్‌ తయారీ కోసం ఐఎస్‌బీతో ఒప్పందం చేసుకున్నారు.

  • మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్‌, ఆధునిక రిటైల్‌ కియో్‌స్కల ఏర్పాటుకు కూలెక్స్‌ పరిశ్రమలుతో ఒప్పందం.

  • స్వయం ఏపీ ఎంటర్‌ప్రైజ్‌ ఏర్పాటు, మార్కెటింగ్‌ కోసం ‘నిర్మాణ్‌’తో ఒప్పందం

  • అరకు కాఫీ, చాయ్‌ రాస్తా అవుట్‌లెట్లకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో..

  • డ్వాక్రా మహిళల ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక సహకారానికి ఈజీ ఫైనాన్స్‌ కంపెనీతో ..

  • మిల్లెట్ల రిటైల్‌ అవుట్‌లెట్ల ఏర్పాటుకోసం 9 నట్జ్‌ మిల్లెట్స్‌ కంపెనీతో ..

  • సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించే సముద్రపు నాచు సాగులో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీతో ఒప్పందం.

  • సీవీడ్‌ ఉత్పత్తులు, మహిళలకు శిక్షణ కోసం కేరళకు చెందిన అమృత విశ్వ విద్యాపీఠంతో ఒప్పందం

  • ఎస్‌హెచ్‌జీ పారిశ్రామికవేత్తలను బలోపేతం చేసేలా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థతో..

  • పొదుపు మొత్తాలతో వ్యాపారాలకు సహకారం అందించేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌సతో ఒప్పందం

  • మహిళా ఎఫ్‌పీవోల బలోపేతం, మార్కెట్‌ లింకేజీ అంశాల్లో సహకారం అందించేందుకు ఐఐఎం విశాఖపట్నంతో ఒప్పందం

  • దేశీయ పౌల్ర్టీ ఉత్పత్తులు, ప్రకృతి సేద్యం, ల్యాండ్‌ స్కేపింగ్‌ అంశాల్లో సహకారానికి వాసన్‌ సంస్థతో ఒప్పందం

  • స్వయం డిజిటల్‌ స్టోర్‌ ఫ్రంట్‌ ద్వారా మార్కెటింగ్‌ట్రిపుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు

  • ఎస్‌హెచ్‌జీ మహిళల కుటుంబాలకు హెల్త్‌ స్ర్కీనింగ్‌ కోసం స్వస్తి ది హెల్త్‌ కేపిటల్‌ సంస్థతో ఒప్పందం

  • గ్రామీణ సంస్థల ఏర్పాటు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ అంశాల్లో సహకారానికి సెంచూరియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందం

  • ఎస్‌హెచ్‌జీల చేనేత ఉత్పత్తుల ఎగుమతి, మార్కెట్‌ లింకేజీ కోసం ఎంబ్యోమ్‌ కన్సల్టింగ్‌ సర్వీసె్‌సతో ఒప్పందం.

Updated Date - Mar 09 , 2026 | 05:37 AM