ఎస్‌ఐఆర్‌డీ పరిధిలోకి రీసోర్స్ సెంటర్లు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:00 AM
రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శిక్షణా సంస్థలన్నింటినీ ...
రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శిక్షణా సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో ఉన్న పంచాయతీ రీసోర్-స సెంటర్ల పరిపాలనా బాధ్యతలను బదిలీ చేసింది. ఇప్పటివరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పరిధిలో ఉన్న రాష్ట్ర పంచాయతీ రీసోర్స్ సెంటర్(ఎస్పీఆర్‌సీ), జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్(డీపీఆర్‌సీ), బ్లాక్ పంచాయతీ రీసోర్స్ సెంటర్స్(బీపీఆర్‌సీ)లు ఇకపై ఏపీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్‌పమెంట్ పీఆర్ (ఏపీఎస్ఐఆర్‌డీ పీఆర్) కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేయనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్‌జీఎస్ఏ) పునర్యవస్థీకరణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పు ద్వారా పంచాయతీ సంస్థల శిక్షణ, సామర్థ్య వృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తారు. ఈ నిర్ణయం ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం నియామకాలు, వ్యయాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, ఏపీఎ్‌సఐఆర్‌డీ పీఆర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.