Share News

పెండింగ్‌ క్రమశిక్షణ కేసుల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:29 AM

ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలు 1991, సవరించిన ఏపీ పెన్షన్‌ నిబంధనలు 1980 ప్రకారం ప్రస్తుతం విధుల్లో ఉన్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై...

పెండింగ్‌ క్రమశిక్షణ కేసుల పరిష్కారానికి చర్యలు

  • కార్యాలయాల వారీగా నోడల్‌ అధికారులు నియామకం

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలు 1991, సవరించిన ఏపీ పెన్షన్‌ నిబంధనలు 1980 ప్రకారం ప్రస్తుతం విధుల్లో ఉన్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కేసులు భారీగా పెండింగ్‌లో ఉండడం వల్ల ఉద్యోగుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్ణీత వ్యవధిలో సమీక్షించడం, వాటిని పరిష్కరించడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో పెం డింగ్‌లో ఉన్న క్రమశిక్షణ కేసుల కోసం నిర్ణీత కాల సమీక్షా విధానాన్ని ప్రవేశపెడుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి 3 నెలలకొకసారి ఈ కేసులను సమీక్షిస్తారు. సాధారణ పరిపాలన శాఖ కన్వీనర్‌గా వ్యవహరిస్తుంది. శాఖాధిపతులు ప్రతి నెలా 2వ మంగళవారం నాడు తమ శాఖలోని క్రమశిక్షణ కేసులపై సమీక్ష నిర్వహించాలి. జిల్లాస్థాయిలో అధికారులు ప్రతి నెలా 1వ మంగళవారం క్రమశిక్షణ పెండింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించాలి. క్రమశిక్షణా కేసులను సకాలంలో పరిష్కరించేందుకు నోడల్‌ అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని స్థాయిల్లో ఉన్న కార్యాలయాల్లో అవినీతి రహిత సీనియర్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించి, సకాలంలో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

Updated Date - Jul 02 , 2026 | 03:29 AM