ఆ పదోన్నతులు తాత్కాలికం
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:47 AM
రాష్ట్రపతి ఉత్తర్వులు 2025, డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఇచ్చిన పదోన్నతులను తాత్కాలికమైనవిగా పరిగణిస్తామని ప్రభుత్వం ...
స్థానిక కేడర్ల ఏర్పాటు తర్వాత మార్పు చేర్పులు: ప్రభుత్వం
డిసెంబరు 15 తర్వాత చేపట్టిన ప్రమోషన్లపై ఉత్తర్వులు జారీ
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులు 2025, డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఇచ్చిన పదోన్నతులను తాత్కాలికమైనవిగా పరిగణిస్తామని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి అమలు చేసిన పదోన్నతులు, ప్రస్తుతం వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న డీపీసీ అంశాలను ఎలా క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 13వ పేరా ప్రకారం, స్థానిక కేడర్ల రూపకల్పనకు ముందు ఇచ్చిన పదోన్నతులు తాత్కాలికమేనని స్పష్టం చేసింది. స్థానిక కేడర్ల రూపకల్పన తర్వాత వాటిని తిరిగి సమీక్షించి, అవసరమైన సర్దుబాట్లు చేస్తామని పేర్కొంది. డిసెంబరు 15 తర్వాత పదోన్నతులు లభించిన ఉద్యోగులకు కేడర్ కేటాయింపు, సీనియారిటీ, తదుపరి పదోన్నతి లేదా పోస్టింగ్ ప్రాంతానికి సంబంధించిన ఎటువంటి శాశ్వత హక్కు ఉండబోదని తెలిపింది. ఇవన్నీ స్థానిక కేడర్ల రూపకల్పన తర్వాతే నిర్ణయిస్తామని పేర్కొంది.