151 జలాశయాల భద్రతకు రూ.27.50 కోట్లు
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:32 AM
రాష్ట్రంలోని 151 జలాశయాలకు రూ.27.50 కోట్లతో భద్రతా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖ నిర్ణయించింది.
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 151 జలాశయాలకు రూ.27.50 కోట్లతో భద్రతా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డ్యామ్ సేఫ్టీ యాక్టు-2021 ప్రకారం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మార్గదర్శకాల మేరకు మరమ్మతు పనులు చేస్తారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో జలాశయాలకు మరమ్మతు పనులు చేపట్టలేదు. డ్యామ్ గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదు. డ్యామ్ గేట్లు తుప్పుపట్టకుండా రంగులు కూడా వేయలేదు. ఈ పరిస్థితుల్లో డ్యామ్ భద్రతా చర్యలు చేపట్టేందుకు యాజమాన్య నిర్వహణ అవసరమని ఇటీవల జల వనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో జల వనరుల శాఖ రూ.27.50 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది.