Share News

ఫ్యాక్టరీస్‌ జోనల్‌ కార్యాలయాల మార్పు

ABN , Publish Date - May 14 , 2026 | 05:08 AM

ఫ్యాక్టరీస్‌ డైరెక్టరేట్‌ పరిధిలోని జిల్లా కార్యాలయాల్లో ప్రభుత్వం కొన్నిమార్పులు చేసింది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఫ్యాక్టరీస్‌ జోనల్‌ కార్యాలయాల మార్పు

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఫ్యాక్టరీస్‌ డైరెక్టరేట్‌ పరిధిలోని జిల్లా కార్యాలయాల్లో ప్రభుత్వం కొన్నిమార్పులు చేసింది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరంలో ఉన్న డిప్యూటీఫ్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కార్యాలయాన్ని అనకాపల్లికి మార్పు చేశారు. విజయవాడలోని కార్యాలయాన్ని మచిలీపట్నానికి, చిత్తూరులోని కార్యాలయాన్ని తిరుపతికి, నెల్లూరులోని కార్యాలయాన్ని నరసరావుపేటకు మార్పు చేశారు. విశాఖపట్నంలోని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌-11 సర్కిల్‌ కార్యాలయాన్ని అనకాపల్లికి, కాకినాడలోని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌-11 సర్కిల్‌ కార్యాలయాన్ని అమలాపురానికి, తెనాలి ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని బాపట్లకు, ఒంగోలు కార్యాలయాన్ని తిరుపతికి మార్పు చేశారు.

Updated Date - May 14 , 2026 | 05:08 AM