యూఎంటీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మార్పు
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:23 AM
అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్(యూఎంటీసీ)లో రాష్ట్ర ప్రభుత్వానికి 16.66 శాతం వాటా ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని ప్రభుత్వం మార్చింది.
డైరెక్టర్‌గా మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి నియామకం
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్(యూఎంటీసీ)లో రాష్ట్ర ప్రభుత్వానికి 16.66 శాతం వాటా ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఎన్‌వీఎ్‌స రెడ్డిని రాష్ట్ర విభజనకు ముందు యూఎంసీటీలో ప్రభుత్వం తరఫున ప్రతినిధి డైరెక్టర్‌గా నియమించారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అమల్లోకి వచ్చిన తర్వాత హెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థ తెలంగాణకు చెందింది. అయినప్పటికీ, యూఎంసీటీలోని 16.66 శాతం వాటా ఏపీ ప్రభుత్వానికే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎన్‌వీఎస్ రెడ్డి నామినేషన్‌ను వెంటనే ఉపసంహరించుకుంది. ఆయన స్థానం లో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ను బోర్డులో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి డైరెక్టర్‌గా నియమించింది.