Share News

రిటైర్డ్‌ ఉద్యోగులకు ఊరట

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:36 AM

రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ట్‌ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న...

రిటైర్డ్‌ ఉద్యోగులకు ఊరట

  • గ్రాట్యుటీ, సరెండర్‌ లీవ్‌ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం

విజయవాడ, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ట్‌ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్‌ లీవ్‌ బిల్లుల చెల్లింపు ప్రక్రియ గురువారం ప్రారంభమైందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విద్యాసాగర్‌, డీవీ రమణ గురువారం తెలిపారు. మొత్తం రూ.2,950 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోందని, ఈ నిధులు రిటైర్డ్‌ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు. సర్వీ్‌సలో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమైనట్టు తెలిపారు.

Updated Date - Apr 10 , 2026 | 03:36 AM