రైతులు, కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సాయం
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:51 AM
రాష్ట్ర విపత్తు సహాయనిధి మార్గదర్శకాల ప్రకారం.. వివిధ అంశాలకు సంబంధించి నిధుల మంజూరుకు ప్రభుత్వం గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విపత్తు సహాయనిధి మార్గదర్శకాల ప్రకారం.. వివిధ అంశాలకు సంబంధించి నిధుల మంజూరుకు ప్రభుత్వం గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది అక్టోబరులో మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.49.80కోట్లు మంజూరుకు పరిపాలన ఆమోదం తెలిపింది. అలాగే 21 జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, భవనాల మరమ్మతులకు రూ.17.54కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు, గాలులకు పంట దెబ్బతిన్న 6,588 మంది ఉద్యాన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.12.58కోట్లు, పెండింగ్‌లో ఉన్న వరద నష్ట నివారణ పనులకు రూ.కోటీ 18లక్షలు మంజూరుకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్-19 సమయంలో కరోనాతో మృతి చెందిన పలువురి కుటుంబాలకు రూ.50వేల చొప్పున విడుదల చేసింది.