Share News

లొంగిపోయిన మావోయిస్టులకు రూ.2.87కోట్లు విడుదల

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:18 AM

లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకం కింద రూ.2.87కోట్లు విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలకు చెందిన...

లొంగిపోయిన మావోయిస్టులకు రూ.2.87కోట్లు విడుదల

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకం కింద రూ.2.87కోట్లు విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలకు చెందిన 56 మంది లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికీ రూ. లక్ష నుంచి రూ.25 లక్షల వరకూ పునరావాస ప్యాకేజీ కింద నిధులు విడుదల చేసింది. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారిపై ఉన్న రివార్డు సొమ్మును ఆ ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు ఇవ్వనుంది. కాగా, ఈ నెలాఖరుకు దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఏరివేయాలని కేంద్ర హోంశాఖ నిర్దేశించుకుంది. మావోయిస్టు పునరావాస పథకాన్ని మే 31 వరకూ అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

Updated Date - Mar 24 , 2026 | 04:19 AM