Share News

ఉద్యాన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:28 AM

రాష్ట్రంలో గతేడాది మే, జూన్‌ నెలల్లో సంభవించిన అధిక వర్షాలు, గాలులు, వడగళ్లకు ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద..

ఉద్యాన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతేడాది మే, జూన్‌ నెలల్లో సంభవించిన అధిక వర్షాలు, గాలులు, వడగళ్లకు ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1.68 కోట్లు విడుదలకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1,285 మంది ఉద్యాన రైతులకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 05:29 AM