Share News

మండల సమాఖ్యలకు 10 కోట్ల వీఆర్‌ఎఫ్‌ నిధులు

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:34 AM

రాష్ట్రంలోని 100 మండల సమాఖ్యలకు దారిద్య్ర నిర్మూలన నిధులు (వీఆర్‌ఎఫ్‌)రూ.10 కోట్లు విడుదల చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మంగళవారం...

మండల సమాఖ్యలకు 10 కోట్ల వీఆర్‌ఎఫ్‌ నిధులు

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 100 మండల సమాఖ్యలకు దారిద్య్ర నిర్మూలన నిధులు (వీఆర్‌ఎఫ్‌)రూ.10 కోట్లు విడుదల చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు మండల సమాఖ్యలకు రూ.8.29 కోట్ల స్టార్టప్‌ ఫండ్స్‌ కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. వీఆర్‌ఎఫ్‌ నిధులు ఒక్కో మండల సమాఖ్యకు రూ.10 లక్షలు, స్టార్టప్‌ ఫండ్స్‌ ఒక్కో సమాఖ్యకు రూ.3.50 లక్షలు చొప్పున 237 మండల సమాఖ్యలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 04:34 AM