‘స్థానికం’లో 34శాతం కోటాకు కృషి: మంత్రి సవిత
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:42 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్‌కు కృషి చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తెలిపారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో...
అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్‌కు కృషి చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తెలిపారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్టు చెప్పారు. కొత్తగా మరో 10 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు. రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఈ పథకం ద్వారా ఆధునిక పరికరాలు అందజేసి, బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా బీసీ చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలోనే కాపులకు మేలు జరిగిందని సవిత తెలిపారు. 2014-19 మధ్య 13 జిల్లాస్థాయి కాపు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. వాటిలో 9 భవనాలను, 487 మినీ కాపు భవనాలు రద్దు చేశారన్నారు. సీఎం చంద్రబాబు కాపులకు 5 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారని, జగన్ ఆ రిజర్వేషన్లను కూడా రద్దు చేశారని మంత్రి తెలిపారు.