Share News

782 ఆస్పత్రులకు రూ.919 కోట్లు చెల్లింపు

ABN , Publish Date - May 20 , 2026 | 03:58 AM

ప్రైవేట్‌ ఆస్పత్రుల బకాయిలకు సంబంధించి 782 ఆస్పత్రులకు రూ.919.13 కోట్లు చెల్లించినట్లు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో కేవీఎస్‌ చక్రధరబాబు తెలిపారు.

782 ఆస్పత్రులకు రూ.919 కోట్లు చెల్లింపు

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ ఆస్పత్రుల బకాయిలకు సంబంధించి 782 ఆస్పత్రులకు రూ.919.13 కోట్లు చెల్లించినట్లు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో కేవీఎస్‌ చక్రధరబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు నివేదిక ద్వారా తెలిపారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ అనుబంధ ప్రైవేట్‌ ఆస్పత్రులకు బకాయిల విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం చెల్లింపుల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ. 5,556 కోట్లను ట్రస్టు అనుబంధ ప్రైవేట్‌ ఆస్పత్రులకు చెల్లించింది. వీటికి అదనంగా రూ. 919.13 కోట్ల చెల్లింపులు జరిగాయి.

Updated Date - May 20 , 2026 | 03:59 AM