వర్సిటీల్లో 1523 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు
ABN , Publish Date - May 15 , 2026 | 04:30 AM
యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వర్సిటీల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యపై గురువారం 19 వేర్వేరు జీవోలు జారీచేసింది
63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
నేడు యూనివర్సిటీల నోటిఫికేషన్లు
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వర్సిటీల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యపై గురువారం 19 వేర్వేరు జీవోలు జారీచేసింది. దీని ప్రకారం యూనివర్సిటీల్లో మొత్తం 1523 పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో 63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 104 ఆర్జీయూకేటీ లెక్చరర్, 2 అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులున్నాయి. వీటిలో రెగ్యులర్ పోస్టులు 1244 కాగా... ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు బ్యాక్‌లాగ్ పోస్టులు 279 ఉన్నాయి. యూనివర్సిటీల వారీగా... ఆంధ్రా వర్సిటీలో 246, ఆదికవి నన్నయలో 47, రాయలసీమ వర్సిటీలో 47, కృష్ణా యూనివర్సిటీలో 43, ఆంధ్రకేసరి యూనివర్సిటీలో 9, ఆర్జీయూకేటీలో 311, శ్రీకృష్ణదేవరాయలో 103, శ్రీవెంకటేశ్వరలో 125, నాగార్జునలో 82, జేఎన్‌టీయూ అనంతపురంలో 95, విక్రమ సింహపురిలో 48, అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో 37, బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో 46, వైఎ్‌సఆర్ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌లో 65, జేఎన్‌టీయూ కాకినాడలో 56, జేఎన్‌టీయూ గురజాడలో 48, ద్రవిడియన్ యూనివర్సిటీలో 20, యోగి వేమనలో 47, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 48 పోస్టులున్నాయి. ఆయా యూనివర్సిటీలు ఈ పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్లు జారీచేస్తాయి. అనంతరం కామన్ పోర్టల్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.