Share News

బెజవాడ కోర్టు న్యాయాధికారికి తప్పనిసరి రిటైర్మెంట్‌

ABN , Publish Date - May 01 , 2026 | 03:45 AM

విజయవాడ 14వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కమ్‌ అదనపు ఫ్యామిలీ కోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న షేక్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌కు ...

బెజవాడ కోర్టు న్యాయాధికారికి తప్పనిసరి రిటైర్మెంట్‌

  • గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): విజయవాడ 14వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కమ్‌ అదనపు ఫ్యామిలీ కోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న షేక్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌కు తప్పనిసరి పదవీ విరమణ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతియాజ్‌ అహ్మద్‌ సర్వీసు రికార్డును సమీక్షించిన హైకోర్టు.. సర్వీసులో కొనసాగడానికి ఆయన సరిపోరని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనకు 2025 ఆగస్టు 31 నాటి నుంచి తప్పనిసరి పదవీ విరమణ విధిస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - May 01 , 2026 | 03:45 AM