‘బాలల’ కమిషన్‌పై బ్లాంక్ జీవో!
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:04 AM
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇచ్చిన జీవోఎంఎస్ నంబర్ 4ను ఏపీజీవోఐఆర్ వెబ్‌సైట్‌లో ఏ సమాచారం లేకుండా(బ్లాంక్)గా ఉంచారు.
అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇచ్చిన జీవోఎంఎస్ నంబర్ 4ను ఏపీజీవోఐఆర్ వెబ్‌సైట్‌లో ఏ సమాచారం లేకుండా(బ్లాంక్)గా ఉంచారు. ఒక సభ్యుని నియామకంపై వచ్చిన ఆరోపణలపై జీవోలో ఉన్న మేటర్‌ను తీసేసి బ్లాంక్‌గా పెట్టినట్లు తెలిసింది. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామక ఉత్తర్వులను ఈ నెల 11న మహిళాశిశు సంక్షేమశాఖ విడుదల చేసింది.