Share News

నెలవారీ ఆర్థిక నివేదికలతో వినూత్న పాలన

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:25 AM

సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల విధానానికి నాంది పలికిందని రాష్ట్ర సమాచార మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

నెలవారీ ఆర్థిక నివేదికలతో వినూత్న పాలన

  • దేశంలోనే తొలిసారి మన రాష్ట్రంలోనే అమలు: పార్థసారథి

అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల విధానానికి నాంది పలికిందని రాష్ట్ర సమాచార మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆర్థిక నివేదికలు వార్షిక ప్రాతిపదికన మాత్రమే రూపొందించే ఆనవాయితీ ఉండగా, మన రాష్ట్రంలో నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే వినూత్న విధానాన్ని ప్రారంభించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్రటరీలు, హెచ్‌ఓడీలు, మంత్రుల సమావేశ వివరాలను వెల్లడించారు. ‘‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనకు ఏటా 15 శాతం ఆర్థిక వృద్ధితోపాటు 20 నుంచి 25 శాతం వరకు ఆదాయ వృద్ధి సాధించేలా పనిచేయాలని శాఖలన్నింటినీ సీఎం ఆదేశించారు. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు 25 వేల మత్స్యకార సొసైటీలను రద్దు చేశారు. చెరువులను, రిజర్వాయర్లను కార్పొరేట్‌కు అప్పజెప్పి వారి జేబులు నింపడానికి ప్రయత్నం చేశారు. మత్స్యకారులు ఎదురు తిరిగి ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేశారు. అటువంటి జగన్‌కు మత్స్యకారుల గురించి మాట్లాడే హక్కుందా? చనిపోయిన మత్స్యకారుల కుటుంబాల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. ఆయన తీరు శవాల మీద పేలాలు ఏరుకునేలా ఉంది. క్రిమినల్‌, గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారు’ అని అన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 04:26 AM