పార్టీ ఆఫీసులకు భూముల లీజు 66 ఏళ్లకు పెంపు
ABN , Publish Date - May 16 , 2026 | 04:53 AM
రాజకీయ పార్టీల కార్యాలయాలకు లీజుపై భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జీవో 340కి కీలక సవరణలు... రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీల కార్యాలయాలకు లీజుపై భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీజు కాలపరిమితిని 33 నుంచి 66ఏళ్లకు పెంచింది. ఈ మేరకు భూ కేటాయింపుల పాలసీని నిర్దేశించే జీవో 340లో కీలక సవరణలు చేస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో 282) జారీ చేశారు. ఈ సవరణ గతేడాది నవంబరు 13 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కాగా, కర్నూలు జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం 1.5 ఎకరాల భూమిని 66 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు (జీవో 285) జారీ చేసింది.