Share News

ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మేడే ఆఫర్‌

ABN , Publish Date - May 06 , 2026 | 04:23 AM

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులకు కూటమి సర్కార్‌ మేడే ఆఫర్‌ ఇచ్చింది. ఉపాధి పథకంలో కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆయా పంచాయతీల్లో...

ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మేడే ఆఫర్‌

  • 7 వేల పని దినాలు కల్పించినవారూ కొనసాగింపు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులకు కూటమి సర్కార్‌ మేడే ఆఫర్‌ ఇచ్చింది. ఉపాధి పథకంలో కీలకంగా పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆయా పంచాయతీల్లో ఏడాదికి 7500 పనిదినాలు కల్పిస్తేనే ఆతర్వాత ఏడాది వారిని కొనసాగిస్తారు. ఆమేరకు ఆ తర్వాత సంవత్సరానికి వారి కాంట్రాక్టును పొడిగిస్తారు. మేడే సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ వారికి వెసులుబాటు కల్పిస్తూ 2025-26 సంవత్సరంలో 7500 కాకుండా 7000 పనిదినాలు కల్పించినప్పటికీ... ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా కొనసాగిస్తూ వచ్చే ఏడాది కూడా వారి కాంట్రాక్టును రెన్యువల్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1223 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఊరట కలిగింది. గత ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సమస్యలు, యాప్‌లలో లోపాలు, పనుల పరిమితి వంటి ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, కనీస అర్హతను 7500 నుంచి 7000 పని దినాలకు తగ్గించారు.

Updated Date - May 06 , 2026 | 04:24 AM