Share News

నూతన లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:09 AM

రాష్ట్ర ప్రభుత్వం నూతన లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డును నియమించింది. ఐదుగురు కంపెనీ యజమానులను, ఒక ఉమెన్‌ యజమాని..

నూతన లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు

అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం నూతన లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డును నియమించింది. ఐదుగురు కంపెనీ యజమానులను, ఒక ఉమెన్‌ యజమాని, మరో ఐదుగురు ఉద్యోగులతో వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేసింది. చంద్రగిరి నుంచి అరె మహేశ్వరి, రాజానగరం నుంచి అర్హరాజు నీలపల, కడప నుంచి ఎల్‌.చంద్రమోహన్‌రెడ్డి, కాకినాడ నుంచి జి.సాయిబాబు, కుప్పం నుంచి విశ్వనాథనాయుడును కంపెనీల నుంచి ప్రతినిధులుగా నియమించారు. ఉమెన్‌ విభాగం నుంచి విజయవాడవాసి ఈడుపు వెంకట రమణిని నియమించారు. ఉద్యోగుల తరఫున డి.నారపురెడ్డి, చింతా రేణుక రాజు (పుట్టపర్తి), మోసయ్య (అరకు) ఎన్‌.వెంకటచలపతిరావు(కైకలూరు), పి.వెంకటశివారెడ్డిని(ఒంగోలు) నియమించారు.

Updated Date - Apr 17 , 2026 | 04:10 AM