Share News

‘అగ్రిగోల్డ్‌’పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

ABN , Publish Date - Jul 01 , 2026 | 04:39 AM

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు త్వరితగతిన న్యాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

‘అగ్రిగోల్డ్‌’పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు త్వరితగతిన న్యాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. హోంమంత్రి అనిత నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఉన్నత స్థాయి కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌ ఉన్నారు. అగ్రిగోల్డ్‌ కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు మొదలుకొని సీఐడీ జప్తుచేసిన రూ.వేల కోట్ల ఆస్తుల వేలం వరకూ మొత్తం 8 అంశాలపై ఈ ఉపసంఘం సమీక్షించి పరిష్కారానికి సిఫారసులు చేయనుంది.

Updated Date - Jul 01 , 2026 | 04:39 AM