ఆక్వా ఫాంగేట్ ధరల పర్యవేక్షణకు కమిటీ
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:24 AM
రాష్ట్రంలో రొయ్యలు, చేపల దాణా ధరల అంచనా కోసం సాంకేతిక సంస్థలు, ఇతర భాగస్వాములతో ఏపీ రొయ్యల ఫాం గేట్ ధరల పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రొయ్యలు, చేపల దాణా ధరల అంచనా కోసం సాంకేతిక సంస్థలు, ఇతర భాగస్వాములతో ఏపీ రొయ్యల ఫాం గేట్ ధరల పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా మత్స్యశాఖ కమిషనర్, వైస్‌చైర్మన్‌గా ఆక్వా అధారిటీ వైస్‌చైర్మన్, సభ్యులుగా మత్స్యశాస్త్ర కళాశాల ప్రిన్సిపల్, మత్స్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త, మత్స్యశాఖ ప్రధాన కార్యాలయంలోని జాయింట్ డైరెక్టర్, కేంద్ర ఉప్పునీటి పరిశోధన సంస్థ డైరెక్టర్, ఎంపెడా అధికారి, రొయ్యల ఎగుమతుల పర్యవేక్షణ ఏజెన్సీ ప్రతినిధి, రొయ్యల వ్యాపారుల నుంచి ఒకరు, ఆక్వా రైతుల నుంచి ముగ్గురు, సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం నుంచి ముగ్గురు, సాంకేతిక నిపుణుడొకరిని నియమించారు.