Share News

21 నెలల్లో 21వేల కోట్ల బకాయిలు విడుదల

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:30 AM

ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు రూ.7,358 కోట్ల బకాయిలు విడుదల చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది.

21 నెలల్లో 21వేల కోట్ల బకాయిలు విడుదల

  • ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు

అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు రూ.7,358 కోట్ల బకాయిలు విడుదల చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈమేరకు అప్సా ప్రెసిడెంట్‌ జి. రామకృష్ణ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు రూ.30,000 కోట్లు ఉండగా, 21 నెలల్లో రూ.21,000 కోట్లు విడుదల చేసిందని రామకృష్ణ చెప్పారు.

Updated Date - Apr 14 , 2026 | 05:30 AM