Share News

పశువుల దాహార్తి తీర్చేలా నీటి తొట్టెలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:37 AM

వేసవిలో పశువులు, జీవాలకు తాగునీటిని అందించేందుకు ఉపాధి హామీ పథకం అనుసంధానంతో యూనిట్‌ విలువ రూ.33వేలతో రాష్ట్రవ్యాప్తంగా 13,929 నీటి తొట్టెలను...

పశువుల దాహార్తి తీర్చేలా నీటి తొట్టెలు

  • రాష్ట్రవ్యాప్తంగా 13,929 నిర్మాణం

  • డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): వేసవిలో పశువులు, జీవాలకు తాగునీటిని అందించేందుకు ఉపాధి హామీ పథకం అనుసంధానంతో యూనిట్‌ విలువ రూ.33వేలతో రాష్ట్రవ్యాప్తంగా 13,929 నీటి తొట్టెలను నిర్మించినట్లు పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు బుధవారం తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖతోపాటు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో నీటి తొట్టెలను నింపి, పశువుల దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశుపోషకులు గ్రామ పంచాయతీలను సంప్రదించి, నీటి తొట్టెలను వినియోగించుకోవాలని సూచించారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 1,445, ప్రకాశం జిల్లాలో 1,376, అన్నమయ్య జిల్లాలో 1,364, శ్రీసత్యసాయి జిల్లాలో 1,357 నీటి తొట్టెలు ఉండగా, పశ్చిమగోదావరి, కోనసీమ, పోలవరం, మార్కాపురం జిల్లాల్లో నీటి తొట్టెలు నిర్మించలేదని చెప్పారు.

Updated Date - Apr 09 , 2026 | 05:38 AM