Share News

హజ్‌ యాత్రికులకు పకడ్బందీగా ఏర్పాట్లు

ABN , Publish Date - May 01 , 2026 | 03:38 AM

రాష్ట్రానికి చెందిన హజ్‌ యాత్రికులకు హైదరాబాద్‌, బెంగళూరు ఎంబార్కేషన్‌ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు, వసతులు కల్పించాలని రాష్ట్ర మైనార్టీ సంక్ష...

హజ్‌ యాత్రికులకు పకడ్బందీగా ఏర్పాట్లు

  • అధికారులకు మంత్రి ఫరూక్‌ ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన హజ్‌ యాత్రికులకు హైదరాబాద్‌, బెంగళూరు ఎంబార్కేషన్‌ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు, వసతులు కల్పించాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అధికారులను ఆదేశించారు. మే 4వ తేదీ నుంచి హజ్‌ యాత్రకు హైదరాబాద్‌, బెంగళూరు నుంచి బయలుదేరే యాత్రికులకు కల్పించిన ఏర్పాట్లపై మంత్రి ఫరూక్‌ గురువారం అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఏపీ నుంచి ఈ ఏడాది 2000 మంది హజ్‌ యాత్రకు వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో ఏప్రిల్‌ 18, 19 తేదీల్లో రెండు విడతలుగా విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి 333 మంది వెళ్లారన్నారు. మిగతావారు హైదరాబాద్‌, బెంగళూరు ఎంబార్కేషన్‌ కేంద్రాలను ఎంచుకున్నట్లు వెల్లడించారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాల ద్వారా హజ్‌యాత్రకు వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు, వసతి, వైద్య సౌకర్యాల కల్పన పూర్తి చేయాలని మైనార్టీశాఖ కార్యదర్శి శ్రీధర్‌కు సూచించామన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ ఎంబార్కేషన్‌ కేంద్రాల ద్వారా హజ్‌కు వెళ్లే ఏపీ యాత్రికులకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి నోడల్‌ అధికారులను నియమించామన్నారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక సహాయక సేవలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Updated Date - May 01 , 2026 | 03:38 AM