Share News

‘పతంజలి’ పార్క్‌కు ప్రత్యేక రాయితీలు

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:46 AM

పతంజలి ఆయుర్వేద సంస్థ విజయనగరం జిల్లాలో స్థాపించనున్న ‘ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.

‘పతంజలి’ పార్క్‌కు ప్రత్యేక రాయితీలు

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): పతంజలి ఆయుర్వేద సంస్థ విజయనగరం జిల్లాలో స్థాపించనున్న ‘ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌’కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. మొత్తం రూ.370.10 కోట్ల పెట్టుబడితో 2వేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే ఏపీఐఐసీ ద్వారా కొత్తవలస మండలం చిన్నరావుపల్లి గ్రామంలో 70 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పార్క్‌ ఏర్పాటుకు ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ కింద మూలధన పెట్టుబడిలో రూ.131.41కోట్లు (39.37 శాతం) వరకు రాయితీని మంజూరు చేస్తూ ప్రధాన కార్యదర్శి (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) చిరంజీవిచౌదరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


న్యూట్రిఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కూడా..

న్యూట్రిఫీడ్స్‌ అండ్‌ ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.216 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలో నెలకొల్పనున్న ఇంటిగ్రేటెడ్‌ చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు కూడా ప్రత్యేక రాయితీలు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - Jun 26 , 2026 | 03:49 AM