శిక్ష కింద సామాజిక సేవ
ABN , Publish Date - May 23 , 2026 | 04:31 AM
శిక్ష కింద సామాజిక సేవను అనుమతిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు మార్గదర్శకాలను ఆమోదిస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు.
ఆస్పత్రులు, ఆఫీసులు, లైబ్రరీలు, పార్కులు, సిగ్నల్స్ వద్ద సేవలకు వీలు
మార్గదర్శకాలు విడుదల
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): శిక్ష కింద సామాజిక సేవను అనుమతిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు మార్గదర్శకాలను ఆమోదిస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వార్డులను శుభ్రపరచడం, క్యాజువాల్టీ, ఓపీ విభాగాల్లో సేవలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కుల పరిసరాల్లో చెత్త ఎత్తివేయడం, ప్రభుత్వ గ్రంథాలయాల్లో పుస్తకాలు సర్దడం, రోడ్డుపక్కన గడ్డి తొలగించడం. సిగ్నళ్ల వద్ద నిలబడి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర సేవలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. 1-31 రోజులు, 40-240 గంటలపాటు ఈ సేవలను అందించడాన్ని శిక్షగా విధించవచ్చు. దీని పర్యవేక్షణ బాధ్యతను జిల్లా ప్రొబేషన్ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారికి ఇచ్చా రు. భారతీయ న్యాయ సంహిత-2023 లోని సెక్షన్ 4(ఎఫ్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023లోని సెక్షన్ 523 ప్రకారం హైకోర్టు దీనిపై మార్గదర్శకాలు ఇచ్చింది. కాగా, కొత్తగా ప్రవేశపెట్టిన భారతీ య న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమమ్ అమలులో సాంకేతికతకు చోటు కల్పిస్తూ హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు.