విద్యుత్తు శాఖలో 629 ఏఈఈ పోస్టులకు ఆమోదం
ABN , Publish Date - May 15 , 2026 | 05:17 AM
విద్యుత్తు శాఖను వేధిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది కొరత తీరనుంది. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి గురువారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు శాఖను వేధిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది కొరత తీరనుంది. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి గురువారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏఈఈల కొరతతో తలెత్తుతున్న సమస్యలపై ఆంధ్రజ్యోతి గురువారం కథనం ప్రచురించింది. 1500 మంది ఏఈఈలకుగాను ప్రస్తుతం 800 మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో 629 ఏఈఈల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలపడం గమనార్హం. ఏపీ ట్రాన్స్‌కోలో 200, ఏపీ జెన్కోలో 100, ఏపీఎస్పీడీసీఎల్‌లో 134, సీపీడీసీఎల్‌లో 60, ఈపీడీసీఎల్‌లో 135 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు.