రూ.1122 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:10 AM
రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మార్కెట్ ద్వారా నిధులు సమీకరించే దిశగా ప్ర భుత్వం కీలక అడుగువేసింది.
మున్సిపల్ బాండ్ల ద్వారా రూ.1010 కోట్ల సమీకరణకు ఆమోదం
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మార్కెట్ ద్వారా నిధులు సమీకరించే దిశగా ప్ర భుత్వం కీలక అడుగువేసింది. పూల్డ్ మున్సిపల్ బాండ్ ఇష్యూ ఫ్రేమ్‌వర్క్ కు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనులకు మొత్తం రూ.1122.86 కోట్ల ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందులో రూ.1010.58 కోట్లు బాండ్ల ద్వారా, రూ.112.29 కోట్లు ఈక్విటీ రూపంలో సమకూరనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో స్ర్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. బాండ్లు జారీ అయిన తర్వాత సమీకరించిన మొత్తంలో 0.5 శాతం ఫీజు ను ఏపీయూఐఏఎంఎల్‌కు చెల్లిస్తారు. పాల్గొనే అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ముందుగానే క్రెడిట్ రేటింగ్ తప్పనిసరి. ఆయా పట్టణ స్థానికసంస్థలు తమ ఈక్విటీ వాటాను అధికారికంగా అంగీకరించాలి.