Share News

‘సమాధాన్‌ సమారోహ్’కు నోడల్‌ అధికారులు

ABN , Publish Date - May 12 , 2026 | 04:54 AM

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను సమాధాన్‌ సమారోహ్-2026లో భాగంగా ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో సామరస్యపూర్వకంగా...

‘సమాధాన్‌ సమారోహ్’కు నోడల్‌ అధికారులు

  • ఇద్దరిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను సమాధాన్‌ సమారోహ్-2026లో భాగంగా ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు నోడల్‌ అధికారులను నియమించారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఐపీఎస్‌ అధికారి కుమార్‌ విశ్వజీత్‌, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మిలను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజీ కార్యాలయం, అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌(ఏవోఆర్‌) కార్యాలయాలతో సమన్వయం చేసుకొని రాజీకి అవకాశం ఉన్న కేసులను, పౌరులపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు, అప్పీళ్లు, ఇకపై విచారణ అవసరం లేని కేసులను వీరు గుర్తిస్తారు. రెండువారాలకోసారి పరిస్థితిని సమీక్షించి వీరు సీఎ్‌సకు నివేదికలు సమర్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 12 , 2026 | 04:55 AM