ఏపీ ఒక అమూల్యమైన రత్నం: గవర్నర్
ABN , Publish Date - May 19 , 2026 | 06:06 AM
భారత కీర్తి కిరీటంలో ఆంధ్రప్రదేశ్ ఒక అమూల్యమైన రత్నమని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు. ‘‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’’ కింద చేపట్టిన యువ సంగంలో..
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): భారత కీర్తి కిరీటంలో ఆంధ్రప్రదేశ్ ఒక అమూల్యమైన రత్నమని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు. ‘‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’’ కింద చేపట్టిన యువ సంగంలో భాగంగా లోక్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో మహారాష్ట్ర విద్యార్థులతో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వర్ణాంధ్ర-2047 దార్శనికత కేంద్రప్రభుత్వ విశిష్ట భారత్ కార్యక్రమానికి అనుగుణంగా ఉందన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.