హైదరాబాద్‌లో పవన్‌కు గవర్నర్ పరామర్శ
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:27 AM
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పరామర్శించారు.
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పరామర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్ స్వగృహంలో ఉన్న లైబ్రరీని ఆయన తిలకించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలను పరిశీలించారు. వాటి గురించి పవన్ కల్యాణ్‌తో ఆసక్తిగా చర్చించారు. పవన్ కోరడంతో ఓ పుస్తకంపై ఆయన ఆటోగ్రాఫ్ చేశారు. గవర్నర్ నజీర్ ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.