Share News

ఉద్యోగుల కల నెరవేర్చిన ప్రభుత్వం: రామకృష్ణ

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:14 AM

కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని.....

ఉద్యోగుల కల నెరవేర్చిన ప్రభుత్వం: రామకృష్ణ

అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని, వారి దశాబ్దాల కలను నెరవేర్చిందని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ అన్నారు. క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేవలం డబుల్‌ ధమాకా కాదని.. ట్రిపుల్‌ ధమాకా అని రామకృష్ణ అభివర్ణించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదన్నారు. సీపీఎస్‌ రద్దు చేయడం చంద్రబాబు చేతుల్లో లేకపోయినా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జీవో నంబరు 107(డెత్‌ గ్రాట్యుటీ), 121(ఫ్యామిటీ పెన్షన్‌) తీసుకొచ్చారని, దీనివల్ల నేడు సీపీఎస్‌ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబానికి నెలకు సుమారు రూ.45వేల పెన్షన్‌ అందుతోందని అన్నారు. ఆ ఘనత కేవలం చంద్రబాబుదేనని చెప్పారు.

Updated Date - Jun 25 , 2026 | 03:14 AM