ఏపీలో మాతృభాషలోనే ప్రాథమిక విద్య!
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:48 AM
మాతృభాష పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక విద్యను తెలుగులోనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.
మంత్రి కందుల దుర్గేశ్.. ‘విశిష్ట’ ఉగాది పురస్కారం స్వీకరణ
సినీ గేయరచయిత చంద్రబోస్‌కు అందెశ్రీ స్మారక అవార్డు
చెన్నై, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మాతృభాష పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక విద్యను తెలుగులోనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. చెన్నైలో ఆదివారం శ్రీకళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. మంత్రి దుర్గేశ్‌కు ‘విశిష్ట’ ఉగాది పురస్కారాన్ని, అలాగే, సినీ గేయరచయిత చంద్రబోస్‌కు అందెశ్రీ స్మారక పురస్కారాన్ని అందజేశారు. మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించుకునే విధంగా చెన్నైలో కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు.