జిల్లా పంచాయతీ అధికారుల బదిలీలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:07 AM
పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు(డీపీఓ), డివిజన్ డెవల్‌పమెంట్ అధికారుల(డీడీఓ)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు(డీపీఓ), డివిజన్ డెవల్‌పమెంట్ అధికారుల(డీడీఓ)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 మంది అధికారులకు కొత్తగా పోస్టింగులు ఇచ్చారు. అమలాపురం డీడీఓ పి.విజయభాస్కర్‌ను పశ్చిమగోదావరి డీపీఓగా, కాకినాడ డ్వామా ఏపీడీ పి.వసంత మాధవిని అమలాపురం డీడీఓగా, అనకాపల్లి డీడీఓ ఎస్.మంజులవాణిని అనకాపల్లి డీపీఓగా, బొబ్బిలి డ్వామా ఏపీడీ కె.రమామణిని అనకాపల్లి డీడీఓగా, కదిరి డీడీఓను సత్యసాయి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా, కదిరి డ్వామా ఏపీడీ వి.రామాంజనేయులను కదిరి డీడీఓగా నియమించారు. డీడీఓ కె.అనురాధను ఎన్టీఆర్ జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈగా, ఈ.సందీ్‌పను అనకాపల్లి డిప్యూటీ సీఈఓగా, వై.సమతను సత్యసాయి జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈఓగా, దుర్గాప్రసాద్‌ను మార్కాపురం జిల్లా పరిషత్ డీప్యూటీ సీఈఓగా నియమిస్తూ పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.