Share News

27 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో 27మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు డీఆర్వోలు, రెవెన్యూ డివిజన్‌లకు ఆర్డీవోలు, వివిధ ప్రాజెక్టులకు పీడీలను ....

27 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ సాయిప్రసాద్‌

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 27మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు డీఆర్వోలు, రెవెన్యూ డివిజన్‌లకు ఆర్డీవోలు, వివిధ ప్రాజెక్టులకు పీడీలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు (జీవో 1115) జారీ చేశారు. పల్నాడు జిల్లా డీఆర్వోగా కె. ఆదయ్యను బదిలీ చేశారు.

ఆర్డీవో పోస్టింగ్‌లు: పార్వతీపురం- కె. మాధురి, పాడేరు- ఎం. భుజంగరావు, కుప్పం- షేక్‌ మహ్మద్‌హుస్సేన్‌, తాడేపల్లిగూడెం-మన్నెం సూర్యారావు, ఉయ్యూరు- కరుణకుమారి, సత్తెనపల్లి- కె. గోపాలకృష్ణ, తెనాలి- శ్రీ రమణి, చీరాల- ఎస్‌.నరసింహరావు, బాపట్ల-ఎ.హరికుమార్‌,గూడూరు-అరుణకుమారి.

Updated Date - Jun 05 , 2026 | 05:23 AM