Share News

రైతుబజార్లలో బియ్యం

ABN , Publish Date - Jul 24 , 2026 | 04:40 AM

బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు..

రైతుబజార్లలో బియ్యం

  • 1న ప్రత్యేక కౌంటర్లు ప్రారంభం

  • బీపీటీ, కేఎన్‌ఎమ్‌ స్టీమ్‌ రైస్‌ కేజీ రూ.52

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరకు బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. బీపీటీ, కేఎన్‌ఎమ్‌ స్టీమ్‌ రైస్‌ కేజీ రూ.52, ముడి బియ్యం కేజీ రూ.50 చొప్పున విక్రయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో బియ్యం ధరలను అదుపు చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గురువారం రాష్ట్ర సచివాలయంలో రైస్‌ మిల్లర్ల ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరకే బియ్యాన్ని విక్రయించేలా ప్రభుత్వానికి సహకరిస్తామని ఆయనకు మిల్లర్లు హామీ ఇచ్చారు.

Updated Date - Jul 24 , 2026 | 04:42 AM