30న ‘రాష్ట్రపతి ఉత్తర్వుల’పై ఉద్యోగ సంఘాలతో భేటీ
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:33 AM
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2025(పీవో-2025) అమలుకు సంబంధించిన అంశాలపై ఉద్యోగ సంఘాలతో ఈ నెల 30న ఆయా శాఖాధిపతులు సమావేశాలు..
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలులోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2025(పీవో-2025) అమలుకు సంబంధించిన అంశాలపై ఉద్యోగ సంఘాలతో ఈ నెల 30న ఆయా శాఖాధిపతులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కీలక అంశాలపై ఉద్యోగ సంఘాలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా హెచ్‌వోడీలతో ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు జూలై 1న సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను సేకరించి జూలై 2వ తేదీ నాటికి తనకు పంపాలని సీఎస్ ఆదేశించారు.