Share News

గుర్రపు డెక్కతో కంపోస్టు తయారీ

ABN , Publish Date - May 26 , 2026 | 04:56 AM

రాష్ట్రంలోని చెరువులు, కాలువలు, సరస్సులు తదితర జల వనరులను శుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

గుర్రపు డెక్కతో కంపోస్టు తయారీ

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చెరువులు, కాలువలు, సరస్సులు తదితర జల వనరులను శుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాటిలో పెరిగిన గుర్రపుడెక్క (హైసింత్‌)ను తొలగించి, దాన్ని కంపోస్టుగా మార్చనున్నారు. దీనిపై మున్సిపల్‌ శాఖ ఎస్‌ఓపీని విడుదల చేసింది. గుర్రపు డెక్క తొలగింపు బాధ్యతను పంచాయతీరాజ్‌, నీటి వనరుల శాఖ చేపడతాయి. తొలగించిన గుర్రపు డెక్కతో కంపోస్ట్‌, బయో ఫెర్టిలైజర్లు తయారు చేస్తారు.

Updated Date - May 26 , 2026 | 04:56 AM